Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పొలిటికల్ మూవీ చేసే ఆలోచనలో పవన్?

  • తెలుగులో 'పింక్' రీమేక్ అంటూ వార్తలు 
  • మారిన పవన్ కల్యాణ్ ఆలోచన
  • సినిమా ద్వారానే మార్పు తెచ్చే ప్రయత్నం
హిందీలో ఆ మధ్య వచ్చిన 'పింక్' సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. అదే సినిమాను తమిళంలో రీమేక్ చేయగా, అక్కడ కూడా సక్సెస్ ను సాధించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను పవన్ హీరోగా తెలుగులోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ వచ్చింది.

అయితే మరో వైపున పవన్ ప్రస్తుత రాజాకీయాల నేపథ్యంలో ఒక కథను సిద్ధం చేయించి దానిని తెరపైకి తీసుకొస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. అధికార పక్షం విధానాలపై ప్రతిపక్ష నాయకుడు చేసే పోరాటం .. చివరికి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం వరకూ ఈ కథలో ఉండేలా ఆయన ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే, ఎన్నికల నాటికి రాజకీయాల నేపథ్యంలోనే మరో సినిమా చేయవచ్చనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టుగా చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.
Pavan

More Telugu News